తెల్లారితే పెళ్లి.. వరుడు చేసిన పనికి షాక్ అయిన వధువు

by  |
తెల్లారితే పెళ్లి.. వరుడు చేసిన పనికి షాక్ అయిన వధువు
X

దిశ, వెబ్ డెస్క్: తెల్లారితే పెళ్లి.. బంధువులందరూ పెళ్లి ఇంటికి చేరుకున్నారు. వధువు ఇంట్లో ఘనంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. తమ కూతురికి మంచి సంబంధం దొరికిందని ఆనందంలో తేలియాడుతున్నారు తల్లిదండ్రులు. కానీ, ఇంతలోనే ఆ పెళ్లి ఇంట విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి పెట్టుకొని వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ అనుకోని సంఘటనతో పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలలోకి వెళితే..

తలకొండపల్లి మండలం మెదక్‌పల్లి గ్రామంలో శ్రీకాంత్‌(24) కు ఇటీవలే పక్క గ్రామానికి చెందిన ఓ యువతి తో వివాహం నిశ్చయమైంది. ఈ శుక్రవారం వీరి పెళ్లి చేయడానికి ఇరువర్గ పెద్దలు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు. తెల్లవారితే పెళ్లి అనగా వరుడు శ్రీకాంత్ గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. శ్రీకాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డడంతో అటు కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతుండగా.. పెళ్లి కూతురు ఇంట విషాదం అలుముకున్నది. శ్రీకాంత్ ఆత్మహత్య కి ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా..? లేక వేరే ఇంకా ఏదైనా కారణమా అని పోలీసులు విచారిస్తున్నారు.

Next Story

Most Viewed