జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గ్రీన్ సిగ్నల్

by  |
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గ్రీన్ సిగ్నల్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. జిల్లాలవారీగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించుకోవాలని కలెక్టర్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ కారణాలతో దాదాపు 2,500కుపైగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొంతమంది పనిభారం తట్టుకోలేక రాజీనామా చేయగా మరికొంతమంది ఇతర ఉద్యోగాలకు వెళ్లారు. ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఉండాలని నూతన చట్టంలో నిబంధన ఉంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పంచాయతీలకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమిస్తున్నారు. ప్రతినెలా రూ. 15000 చొప్పున వేతనంతో మూడేండ్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ప్రొబెషనరీ సమయంగా పని చేయాల్సి ఉంటుంది. త్వరలోనే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.



Next Story

Most Viewed