చిన్న ఐటీ కంపెనీలకు అద్దె మినహాయింపు!

by  |
చిన్న ఐటీ కంపెనీలకు అద్దె మినహాయింపు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారితో దేశంలో లాక్‌డౌన్ పొడిగించినందున ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న చిన్న స్థాయి సాఫ్ట్‌వేర్ సంస్థలకు కేంద్రం ఊరటనిచ్చింది. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ కేంద్రంగా పనిచేస్తున్న చిన్నస్థాయి ఐటీ కంపెనీలకు నాలుగు నెలల వరకూ అద్దె చెల్లించనవసరం లేదని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆదేశించింది. లాక్‌డౌన్ కొనసాగుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో అర్హత ఉన్న చిన్నస్థాయి ఐటీ సంస్థలన్నిటికీ మార్చి 1 నుంచి జూన్ 30 వరకూ అద్దె మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని సుమారు 60 సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లలో సంస్థలను నిర్వహిస్తున్న చిన్న స్థాయి కంపెనీలు, స్టార్ట్అప్ సంస్థలు మొత్తం 200 కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దాదాపు 3,000 మంది సిబ్బందికి ప్రత్యక్షంగానూ, ఇంకొందరికీ పరోక్షంగా లబ్ది ఉంటుందని వివరించారు.

Tags: IT Services, IT Parks, IN India, It Companies Rent


Next Story