మరింతమందికి పీఎఫ్ ప్రయోజనాలు!?

by  |
మరింతమందికి పీఎఫ్ ప్రయోజనాలు!?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రభుత్వం పీఎఫ్ ప్రయోజనాలను మరిన్ని కంపెనీలకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ప్రకటించిన దానికంటే ఎక్కువ కంపెనీలలో యజమాని, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వాటాను చెల్లించవచ్చని, దీనికి ప్రభుత్వం త్వరలో ప్రకటన చేసే అవకాశమున్నట్టు జాతీయ మీడియా చెబుతోంది. ఇటీవల కేంద్ర రూ. 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో రానున్న మూడు నెలలకు యజమాని, ఉద్యోగుల పీఎఫ్ వాటా 24 శాతాన్ని కేంద్రం చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇది వందమంది ఉద్యోగులున్న సంస్థలకు, రూ. 15 వేలు లోపు జీతం ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఇండియాలో పెరుగుతున్న కేసులను బట్టి, లాక్‌డౌన్ ఎత్తివేయడంతో పూర్తీ స్పష్టత లేనందున యజమానులపై భారం తగ్గించేందుకు, ఉద్యోగులకు నష్టాలను, జీతాల కోతలను నివారించేందుకు ప్రభుత్వంపై ఇప్పటికే అధిక ఒత్తిడి ఉంది. అంతేకాకుండా, కార్మిక మంత్రిత్వ శాఖా ప్రతిరోజూ జీతం తగ్గింపులు, ఉద్యోగుల కోతలపై ఎప్పటికప్పుడు డేటా సేకరిస్తోంది. అలాగే, దేశంలో నిరుద్యోగ పరిస్థితిని గమనించేందుకు ప్రధానం మంత్రి కార్యాలయానికి ప్రతి వారం నివేదిక అందుతోంది. ఈ క్రమంలోనే మరిన్ని సంస్థలకు, మరింతమంది ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు అందించేందుకు కేంద్రం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Tags : Epfo, Pf, Provident Fund, Government Pf Contribution, Coronavirus Job Sector

Next Story

Most Viewed