వాళ్లకు ఎక్స్ర్టా పన్ను లేదట! అందుకే విశ్వాస్ పథకం అంటున్న సీబీడీటీ

by  |
tax
X

దిశ, వెబ్‌డెస్క్: వివాద్ సే విశ్వాస్ పథకం కింద ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే పన్ను చెల్లించే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) పొడిగిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఆగష్టు 31 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులు అవసరమైన ఫారాన్ని జారీ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా ఈ సడలింపు ఇస్తున్నట్టు సీబీడీటీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘వివాద్ సే విశ్వాస్ చట్టం కింద డిక్లరేషన్ చెల్లింపు కోసం కావాల్సిన ఫారమ్ 3 జారీ చేయడం, సవరించడంలో ఎదురవుతున్న సవాళ్లను పరిగణలోకి తీసుకుని అదనపు ఛార్జీలు లేకుండా నెలరోజుల పాటు గడువును పొడిగిస్తున్నట్టు’ సీబీడీటీ ప్రకటించింది.

అదనపు ఛార్జీలతో పన్ను చెల్లించేందుకు చివరి తేదీ అక్టోబర్ 31కి ముగుస్తుందని, ఆ తర్వాత గడువు పొడిగింపు ఉండదని సీబీడీటీ స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న పన్ను వివాదాలను పరిష్కరించేందుకు గతేడాది ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. దీని ద్వారా రూ. లక్ష కోట్లకు పైగా వివాదాస్పద పన్ను క్లెయిమ్‌లలో రూ. 54 వేల కోట్లకు పైగా అదాయం సంపాదించింది. 2020, జనవరి నాటికి పెండింగ్‌లో ఉన్న మొత్తం 5.10 లక్షల పన్ను వివాదాల్లో ప్రభుత్వం 1.48 లక్షల కేసులకు డిక్లరేషన్‌లు, 1.33 లక్షల కేసులకు చెల్లింపులను పూర్తి చేసింది.



Next Story

Most Viewed