జగన్ సంచలన నిర్ణయం.. గవర్నర్ ఆమోదం

by  |
AP Governor
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కార్పొరేషన్‌లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ చైర్మన్లు ఉండేలా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేశారు. పరిపాలనా సంస్కరణల్లో మంగళవారం అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైఎస్ చైర్మన్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం పంపారు. ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, వైస్ చైర్మన్ ల ఆర్డినెన్స్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈనెల 18 అనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మేయర్ల ఎంపిక జరగనుంది. ఇంతలోనే గవర్నర్ ఆర్డినెన్స్ కి ఆమోదం తెలపడంతో ఇక నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, చైర్మన్‌ల విధానం అధికారికంగా అమల్లోకి రానుంది.

Next Story

Most Viewed