పెళ్లిలో జరిగే ఆ ఘట్టం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయంటే?

by Mamatha |
పెళ్లిలో జరిగే ఆ ఘట్టం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. అందుకే జీవితంలో ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ఇక వివాహం అన్నాక ఎన్నో రకాల ఆచార వ్యవహారాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం పూర్వీకుల నుంచి కొన్ని వస్తున్నాయి. అయితే కొన్ని పెళ్లిళ్లు ఎంతో అంగరంగా వైభవంగా చేస్తే..మరికొన్ని పెళ్లిళ్లు తూతూ మంత్రంగా జరుపుతారు. కానీ ఏ పెళ్ళిలో కూడా కీలక ఘట్టాలు ఉంటాయి. అందులో ఒక ఘట్టమే ఈ కన్యాదానం. అయితే ఆచారం ప్రకారం పెళ్లిలో అల్లుని కాళ్లను పిల్లనిచ్చే మామ కడగాల్సి ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.

పెళ్లి జరిగే మండపంలో వరుడిని మండపానికి పడమటి వైపు కూర్చోబెడతారు. ఈ క్రమంలో కన్యాదాత లో భాగంగా మామ మొదటగా అల్లుని యొక్క కుడి కాలు ఆ తర్వాత ఎడమ కాలిని కడిగి..ఆ నీటిని నెత్తిపై చల్లుకుంటారు. అయితే దీని వెనకున్న అర్థం చాలా మందికి తెలియదు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును ధర్మ, అర్ధ, కామ, మోక్షలకై నీకు అర్పిస్తున్నట్టు..పెళ్లి కొడుకును శ్రీమన్నారాయణుడిగా, బిడ్డను లక్ష్మీ దేవిగా భావించి అల్లుడి కాళ్లను కడుగుతారు. ఇవేగాక మరికొన్ని సంప్రదాయాలు కూడా తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి.

Next Story

Most Viewed