అమ్మకానికి ఐఆర్‌సీటీసీలో ప్రభుత్వం వాటా!

by  |
అమ్మకానికి ఐఆర్‌సీటీసీలో ప్రభుత్వం వాటా!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేలో సేవల వినియోగం కోసం ఉద్దేశించిన ఐఆర్‌సీటీసీలో తన వాటాను విక్రయించడం ద్వారా రూ. 4,374 కోట్లను పొందాలని భావిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా కంపెనీలో 20 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీలో కేంద్రానికి 87.4 శాతం వాటా ఉండగా, ఇందులో 3.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచాలని చూస్తోంది.

ఒక్కో షేర్ ధరను రూ. 1,618 ఉండగా, ప్రస్తుతం అమ్మకానికి రూ. 1,367కి విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం(డిసెంబర్ 11) నుంచి నాన్ రిటైలర్లకు కొనుగోలు అవకాశాన్ని ఇవ్వనుండగా, శనివారం నుంచి రిటైల్ ఇవెస్టర్లకు వెసులుబాటు కల్పించనుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే చెప్పారు. కరోనా వల్ల ప్రభుత్వ ఖజానాలో ఏర్పడ్డ సంక్షోభాన్ని పూడ్చేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఐఆర్‌సీటీసీలో వాటా విక్రయం ఉండనుందనే వార్తలతో గురువారం ఐఆర్‌సీటీసీ షేర్ మార్కెట్లో 13 శాతం పడిపోయి రూ. 1,405 వద్ద ట్రేడయింది.

Next Story

Most Viewed