బడ్జెట్‌లో ప్రోత్సాహాన్ని ఆశిస్తున్న దేశీయ బొమ్మల పరిశ్రమ

53

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ తయారీని పెంచే క్రమంలో బొమ్మల పరిశ్రమను ప్రోత్సహించేందుకు రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం తగిన విధానాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుతూనే దేశీయ పరిశ్రమల పటిష్ఠతకు ఈ విధానాలు మేలు కలిగేలా ఉండాలని, దీనివల్ల స్టార్టప్‌లను సైతం ఆకర్షించనున్నట్టు వారు అభిప్రాయపడుతున్నారు. బొమ్మల తయారీని ప్రోత్సహించడానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. గతేడాది బొమ్మలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. అలాగే, దేశీయ మార్కెట్లోకి చౌకైన బొమ్మలను తగ్గించేందుకు క్వాలిటీ కంట్రోల్‌ను అమలు చేశారు.

అంతర్జాతీయ బొమ్మల పరిశ్రమలో దేశానికి చాలా తక్కువ వాటా ఉందని, ప్రస్తుత డిమాండ్‌లో భారత ఎగుమతుల వాటా 0.5 శాతం తక్కువగా ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల బొమ్మల పరిశ్రమ విభాగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, సరైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల పరిశ్రమ వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాయి. ఈ రంగంలో తయారీని పెంచడం వల్ల భారత్ నుంచి బొమ్మల ఎగుమతిని పెంచేందుకు సహాయంగా ఉంటుందని వారు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం భారత్‌లో బొమ్మల పరిశ్రమ అసంఘటిత రంగంలో ఉంది. ఇందులో సుమారు 4000 చిన్న, మధ్య తరహా సంస్థలు పనిచేస్తున్నాయి. దేశంలో 85 శాతం బొమ్మలు దిగుమతి అవుతున్నాయంటే ఈ పరిశ్రమ ఎలాంటి స్థితిలో ఉందో అర్థమవుతుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..