ఇంటర్ కళాశాలలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

by  |
Inter first year students
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలు ఫీజులతో సంబంధం లేకుండా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి అసైన్‌మెంట్‌లు స్వీకరించాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. అసైన్‌మెంట్‌ల స్వీకరణ కోసం ఫీజులు చెల్లించాలని విద్యార్థులను, తల్లిదండ్రులను వేధిస్తే కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. ఫీజుల విషయంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పెడితే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డ్ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ నెల 30 వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్‌మెంటర్ ఎడ్యూకేషన్ అసైన్‌మెంట్‌లు కళాశాలల్లో సమర్పించాలని సూచించారు. గడువు తేది ముగిసిన తరువాత సమర్పించిన అసైన్‌మెంట్‌లను పరిగణలోకి తీసుకోరని తెలియజేశారు. కళాశాల ఉపాధ్యాయులు మే 3వరకు అసైన్‌మెంట్ల వ్యాల్యూవేషన్ పూర్తిచేసి మార్క్‌లను కేటాయించాలను తెలిపారు. విద్యార్థుల మార్కుల జాబితాలను ఇంటర్ బోర్డ్‌కు సమర్పించాలని ఆదేశించారు. ఇంటర్ మొదటి సంవత్సం విద్యార్థులకు ఇప్పటికే పరీక్షలు రద్దు చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించే పరీక్షలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Next Story