600 యాప్‌లకు గుడ్‌బై చెప్పిన గూగుల్

by  |
600 యాప్‌లకు గుడ్‌బై చెప్పిన గూగుల్
X

దిశ, వెబ్‌డెస్క్: తమ విచ్ఛేదక ప్రకటనల పాలసీని ఉల్లంఘించిన 600 యాప్‌లకు గూగుల్ స్వస్తి పలికింది. ప్లేస్టోర్ నుంచి వాటిని తొలగించి, వాటి డెవలపర్ల మీద నిషేధం విధించింది. ఈ యాప్‌లు సంబంధం లేకుండా, ఎప్పుడుపడితే అప్పుడు ప్రకటనలను గుప్పించాయని గూగుల్ తమ బ్లాగులో వివరణ ఇచ్చుకుంది.

యాప్‌లో యాక్టివ్‌గా లేనపుడు, వినియోగదారుడు కాల్ లేదా మెసేజ్ చేయాలనుకున్నపుడు అసంబద్ధంగా ప్రకటనలు చూపించి ఇబ్బంది కలిగించిన నెపంతో ఈ యాప్‌లను గూగుల్ తొలగించింది. ఇలాంటి యాప్‌లను గుర్తించడానికి గూగుల్ తమ మెషీన్ లెర్నింగ్ సహాయం తీసుకుంది. ఈ యాప్‌లన్నీ ముఖ్యంగా చైనా, హాంకాంగ్, సింగపూర్, ఇండియా దేశాలకు చెందిన డెవలపర్లు తయారు చేసినవని, అన్నీ కలిపి దాదాపు 4.5 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్ అయినట్లు తెలుస్తోంది.

తొలగింపు గురైన యాప్‌లలో 45 యాప్‌లు చైనాకు చెందిన చీతా మొబైల్ కంపెనీవి. గతంలో కూడా ఈ కంపెనీకి చెందిన యాప్‌లను గూగుల్ తొలగించింది. కానీ ఈసారి పూర్తిగా డెవలపర్ల మీదనే గూగుల్ నిషేధం విధించడం గమనార్హం.



Next Story