గూగుల్ పే ‘టోకెన్’ పేమేంట్స్

by  |
గూగుల్ పే ‘టోకెన్’ పేమేంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది డిజిటిల్ యాప్ పేమెంట్స్‌కు అలవాటు పడిపోయారు. ఇప్పటివరకు అందరూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపీఐ) ఆధారిత చెల్లింపులు చేశారు. కస్టమర్లకు మరింత సురక్షిత పేమేంట్స్ అందించేందుకు చెల్లింపు విధానంలో మరో సరికొత్త విధానాన్ని గూగుల్ పే తీసుకు రాబోతుంది. అదే ‘డిజిటల్ టోకెన్’ సిస్టమ్. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల 16 అంకెల నెంబర్ ఉపయోగించకుండా .ఈ టోకెన్ సిస్టమ్‌లో డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు. ఆ టోకెనైజేషన్ అంటే ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

డిజిటల్ పేమెంట్స్ చేసే తమ వినియోగదారులకు మరింత సేఫ్టీ మెజర్స్ అందివ్వడానికి గూగుల్ పే టోకెనైజేషన్ పద్ధతిని తీసుకువస్తోంది. సాధారణంగా ప్రతి బ్యాంకు కార్డుకు 16 అంకెల సంఖ్య ఉంటుంది. ఇది కస్టమర్ కార్డు ఐడెంటిఫైయర్‌గా పనిచేస్తుంది. పేమెంట్ చేసే సమయంలో గూగుల్ పే ఈ 16 అంకెల్ని రాండమ్ నెంబర్‌గా మార్చి స్టోర్ చేస్తుంది. ఆ కార్డు నెంబర్‌కు బదులుగా మరో 16అంకెలతో టోకెన్ నెంబర్‌ను జనరేట్ చేస్తుంది. కస్టమర్ ఆ కార్డును ఉపయోగించి చెల్లింపు చేయాలనుకున్నప్పుడు, వీసా కార్డు అసలు 16 -అంకెల సంఖ్యకు బదులుగా టోకెన్ నంబర్‌ను ‌ వ్యాపారితో పంచుకుంటుంది. దీంతో అవతలి వ్యక్తికి కార్డ్ నంబర్ కన్పించకుండా ఉండటమే కాకుండా లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి.

టోకెనైజేషన్ కోసం మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్‌తో కార్డును గూగుల్ పేకి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. కార్డును టోకెనైజ్డ్ ఫార్మాట్లోకి మార్చుకోవాలి. గూగుల్ పేలో పేమెంట్స్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ కోసం బ్యాంకు కార్డును ఎంచుకున్న తర్వాత ఓటీపీ ద్వారా ట్రాన్సాక్షన్ పూరిచేయొచ్చు. 16 అంకెల కార్డు నంబర్, సీవీవీ, ఎక్స్పైరీ తేది వివరాలను పదేపదే పంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఎస్‌బీఐ, యాక్సిక్, కోటక్ బ్యాంకు కస్టమర్లకు అందుబాటులో ఉంది. కాగా, మరిన్ని బ్యాంకులతో గూగుల్ చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఇతర బ్యాంకుల కస్టమర్లు ఈ తరహా సేవలు వినియోగించుకోవచ్చు.


Next Story