గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ట్రావెలర్స్‌కు ఎకో-ఫ్రెండ్లీ రూట్స్

by  |
help travelers
X

దిశ, ఫీచర్స్ : వాహనాల్లో దూర ప్రయాణాలు చేసినప్పుడు వాటి నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు వాతావరణ మార్పులకు కారణమతాయి. అయితే ఈ సమస్య తలెత్తకుండా ఎలా ప్రయాణించాలో ఖచ్చితమైన సమాచారాన్ని యూజర్లకు అందిస్తోంది గూగుల్. వాతావరణ మార్పులకు సంబంధించి ప్రయాణ ప్రణాళికలు ఎలా దోహదపడతాయో చూపించడానికి కంపెనీ Google మ్యాప్స్, Google ఫ్లైట్స్‌లో కొత్త ఫీచర్‌లను విడుదల చేస్తోంది.

పర్యావరణ అనుకూల మార్గాలు..

డ్రైవర్లు తమ గమ్యస్థానానికి చేరేందుకు దగ్గరి దారులను చూపించే Google మ్యాప్స్.. ఇప్పుడు అదనంగా ఫ్యూయల్ ఆదా చేసుకునే మార్గాన్ని కూడా చూపనుంది. గూగుల్ ఈ కొత్త ఫీచర్‌ అందించేందుకు ‘యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ లేబొరేటరీ’ నుంచి తీసుకున్న డేటాను పొందుపరిచింది. ఇది యూజర్లకు పర్యావరణ అనుకూల రూటింగ్‌ను సూచిస్తూ ఏడాదికి ఒక మిలియన్ టన్నుల కన్నా మించిన కార్బన్ ఉద్గారాలను వాతావరణంలోకి రాకుండా నిరోధించగలదని అంచనా వేసింది. ఇది రోడ్డుపై నడిచే 200,000 కార్లను తొలగించడంతో సమానమని గూగుల్ పేర్కొంది. కాగా Google మ్యాప్స్ యాప్‌లో అత్యంత పర్యావరణానుకూల మార్గం చిన్న ఆకుపచ్చ ఆకుతో ప్రదర్శించబడుతుంది. ట్రిప్ ఎంత సమయం పడుతుంది? డ్రైవర్ ఎంత ఇంధనాన్ని ఆదా చేయగలడు? అనే సమాచారం రూట్ ఆప్షన్‌లో ఉంటుంది.

బైక్ అండ్ స్కూటర్ షేరింగ్..

బైకింగ్ ఫీచర్‌తో పాటు బెర్లిన్, న్యూయార్క్ సహా 300 నగరాల్లో – గూగుల్ మ్యాప్స్ బైక్, స్కూటర్ షేరింగ్ గురించి మరింత సమాచారం అందించే ఫీచర్‌ను పరిచయం చేస్తింది. ఈ కొత్త ఆప్షన్‌తో, గూగుల్ మ్యాప్స్ యూజర్లు సమీపంలోని డాకింగ్ స్టేషన్‌లను కనుగొనగలరు మరియు ఆ సమయంలో ఎన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయో గుర్తించగలరు.

సైక్లిస్టులకు లైట్ నావిగేషన్

గూగుల్.. సైక్లిస్టుల కోసం లైట్ నావిగేషన్ అనే ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా సైక్లిస్టులు తమ స్క్రీన్‌ను ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా లేదా టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను నమోదు చేయకుండానే వారి ట్రావెల్ రూట్ గురించి ముఖ్యమైన వివరాలను త్వరగా చూడగలరు. తమ ట్రిప్ ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేయగలగడంతో పాటు రియల్ టైమ్‌లో ETA(Estimate travel arrive) అప్‌డేట్‌ను చూడవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం యూఎస్‌లోని గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు ఐఓఎస్‌తో పాటు ఆండ్రాయిడ్ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. వచ్చే ఏడాదికల్లా యూరప్‌ సహా ఇతర దేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముంది.


Next Story