అది తప్పుడు రిపోర్టు… ఢిల్లీ క్యాపిటల్స్‌కి గుడ్‌న్యూస్

90

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కాస్త ఊరట లభించింది. ఆ జట్టు కీలక బౌలర్ అన్‌రిస్ నోర్కియా క్వారంటైన్ నుంచి బయటకు వచ్చి తిరిగి జట్టుతో చేరాడు. బుధవారం అతడికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. అది తప్పుడు రిపోర్టు అని తేలినట్లు ఢిల్లీ క్యాపిటిల్స్ తాజాగా ట్వీట్ చేసింది.

‘మా పేస్ సూపర్ స్టార్ క్వారంటైన్ నుంచి బయటకు వచ్చాడు. తప్పుడు రిపోర్ట్ తర్వాత మూడుసార్లు పరీక్షలు నిర్వహించగా.. అన్‌రిక్ నోర్కియాకు కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో అతడు తిరిగి జట్టుతో చేరాడు. అతడి యాక్షన్ చూసేందుకు వెయిట్ చేయండి’ అని ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..