సీఎం పినరయి మెడకు గోల్గ్ స్మగ్లింగ్ కేసు

by  |
సీఎం పినరయి మెడకు గోల్గ్ స్మగ్లింగ్ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం పినరయి విజయన్‌కు చుక్కెదురైంది. కేసుయూఏఈ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ విషయంలో ఆయనపై ఆరోపణలు రావడమే కాకుండా.. ప్రతిపక్షాల నుంచి ఏకంగా రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గోల్డ్ స్మగ్లర్స్‌కు సీఎం ఆఫీస్ నుంచి హెల్ప్ చేయడం ఏంటని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నారు.

జులై 4న రూ. 15 కోట్ల విలువైన బంగారం తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ బంగారం యూఏఈ నుంచి కేరళలోని రాయబార కార్యాలయం పేరుతో రావడం చర్చనీయాంశంగా మారింది. యూఏఈలో క్యాన్సులేట్‌లో పనిచేసిన స్వర్న సురేష్ అనే మహిళ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన యూఏఈ విచారణ చేపట్టామని.. తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అనవసరంగా రాయబార కార్యాలయం పేరు చెడగొడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఫైర్ అయిన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీకి కూడా ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల మోదీకి లేఖ రాశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌ను కేరళ ప్రభుత్వం వాంటెడ్లీ నియమించిందని, అప్పటికే ఆమెపై నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ కేసు వ్యవహారంపై స్పందించిన సీఎం పినరయి విజయన్ ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు తేల్చి చెప్పారు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంతో కేరళలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.

Next Story

Most Viewed