దిగొస్తున్న బంగారం ధరలు

by  |
దిగొస్తున్న బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గిన కారణంగానే దేశీయంగా దిగొస్తున్నట్టు కమొడిటీ మార్కెట్ల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర బుధవారంతో పోలిస్తే 23 డాలర్లు తగ్గి 1934 డాలర్లకు చేరుకుంది.

డాలర్ విలువ బలపడటంతో పాటు, ఇన్వెస్టర్లు కరెన్సీ, ఈక్విటీ మార్కెట్లకు తమ పెట్టుబడులను తరలించడం వల్లే బంగారం ధరలు రోజురోజుకు తగ్గుతున్నట్టు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో యూఎస్ డాలర్ మరింత బలపడితే బంగారం ధరల అనిశ్చితి కొనసాగుతుందని, తద్వారా బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 430 తగ్గి రూ. 53,200గా ఉంది.

వెండి ధరలు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. గురువారం వెండి ధర కిలో రూ. 1,600 తగ్గి రూ. 65,600కి చేరుకుంది. ఇక, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 390 తగ్గి రూ. 48,770గా ఉంది. ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ. 53,200 ఉండగా, ముంబైలో రూ. 50,340, ఢిల్లీలో రూ. 54,110, కోల్‌కతాలో రూ. 52,690, బెంగళూరులో రూ. 52,490గా ఉంది.

Next Story

Most Viewed