చదువుకోవాలనే ఆ బాలిక పట్టుదల.. ఎంతటి సాహసం చేయించిందో..

by  |
చదువుకోవాలనే ఆ బాలిక పట్టుదల.. ఎంతటి సాహసం చేయించిందో..
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే యూపీకి చెందిన 11వ తరగతి విద్యార్థి సంధ్య సహానీకి స్మార్ట్‌ఫోన్ లేనందున క్లాసులు అటెంట్ కాలేకపోయింది. ప్రస్తుతం మహమ్మారి కేసులు తగ్గడంతో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. ఇది సంధ్యకు శుభవార్తే అయినా, కొన్ని రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో వారి ప్రాంతమంతా వరదలు వచ్చాయి. అయినా స్కూలు వెళ్లాలని నిశ్చయించుకున్న ఆ అమ్మాయి.. పడవలో పాఠశాలకు వెళ్లడం విశేషం.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా రహదారులు, వీధులు కూడా జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సంధ్య ఇంటి పరిసరాలను వరద ముంచెత్తింది. అయితే ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులు మిస్ అయిన సంధ్య, తప్పనిసరిగా క్లాసులకు అటెండ్ కావాలనే అనుకుంది. దీంతో సంధ్య పడవను తానే స్వయంగా నడుపుకుంటూ ఇంటి నుంచి బహ్రరాంపూర్ స్కూలుకు చేరుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఆమె సాహసానికి, పట్టుదలకు సర్వత్రా అభినందనలు అందుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా సంధ్య ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు.

Next Story