ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీక్.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

by  |
Shamshabad airport
X

దిశ, రాజేంద్రనగర్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజీ పైప్‌లైన్ క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీకై ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. విమానాశ్రయంలోని అరవెల్‌లోని డ్రైనేజీ క్లియర్ చేయడానికి ఫైబర్ సింధూరి ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ సర్వీస్‌లో ప్లంబర్‌గా పనిచేస్తున్న నర్సింహారెడ్డి, జాకీర్, ఇలియాన్‌లు వెళ్లారు. పైప్‌లైన్ మరమ్మతులు చూస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో పనిచేస్తున్న ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

గమనించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నరసింహా రెడ్డి (42) మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో ఇద్దరు జాకీర్, ఇలియాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇవ్వకుండా పనిచేయించడం వల్లే ఇలాంటి ఘోరమైన ఘటన జరిగిందని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed