గంగూబాయి టైటిల్ వివాదం

by  |
gangubai kathiawadi
X

దిశ, సినిమా : సంజయ్ లీలా భన్సాలీ చిత్రాలు ఎంత లావిష్‌గా ఉంటాయో, ఏ స్థాయి విజయాలను సొంతం చేసుకుంటాయో! అంతే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతుంటాయి. ఇలా వివాదాల నడుమ విడుదలైన ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ చిత్రాలు సక్సెస్ అందుకోగా, భన్సాలీ మేకింగ్‌కు అందరూ ఫిదా అయిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన ఆలియా భట్‌తో కలిసి చేస్తున్న ‘గంగూబాయి కతియావాడి’‌ విషయంలోనూ మళ్లీ కాంట్రవర్సీలు తెరమీదకు వస్తున్నాయి. ఆ సినిమా పేరు మార్చాలనే డిమాండ్ వినిపిస్తుండగా, మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ కూడా టైటిల్ మార్పునకు డిమాండ్ చేస్తుండటం విశేషం.

‘గంగుబాయి కతియావాడి’ టీజర్ ఇటీవలే విడుదలవగా.. ప్రేక్షకులు, ఇండస్ట్రీ నుంచి మంచి అప్లాజ్ అందుకుంది. అయితే ఈ చిత్రంతో పాటు హాట్‌స్టార్‌లో ‘కామతిపుర’ పేరుతో ఓ సీరియల్ టెలీకాస్ట్ అవుతోంది. కాగా ఈ రెండు ప్రాజెక్ట్‌ల వల్ల ‘కామతిపుర’ ‘కతియావాడి’పై రాంగ్ ఇంప్రెన్షన్ ఏర్పడుతుందని, సమాజంలోని ఓ నిర్దిష్ట వర్గానికి చేటు జరుగుతుందని మహారాష్ట్ర విధానసభలో ఎమ్మెల్యే అమీన్ పటేల్ వ్యాఖ్యానించాడు.

‘హాట్ స్టార్ ప్రసారం చేస్తున్న ‘కామతిపుర’ వెరీ బ్యాడ్ సీరియల్, దీన్ని ప్రసారం చేయనివ్వొద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అడిషనల్ పోలీస్ కమిషనర్ కూడా ఈ షో టెలికాస్ట్ చేయొద్దని స్టే ఇచ్చారు.గంగూబాయి కతియావాడి అనే చిత్రం కామతిపురను చెడుగా చూపిస్తుంది. ఓ మంచి పని చేసిన మహిళ గురించి ప్రజలు తెలుసుకోవాలి, కాని గంగూబాయి గురించి నేర్చుకోవడానికి ఏం ఉంటుంది. ప్రస్తుతమున్న కామతిపురకు, ఐదు దశాబ్దాల కిందటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన బాలికలు డాక్టర్, ఇంజనీర్, పైలెట్‌ అయ్యారు. ఈ మూవీ టైటిల్ మార్చడంతో పాటు ఈ రోజు కామతిపురలో పరిస్థితులెలా మారాయో చూపించమని హోంమంత్రిని అభ్యర్థిస్తున్నాను. టైటిల్‌పై ప్రభుత్వం జోక్యం చేసుకుని ‘కతియావాడి’ అనే పదాన్ని మార్చాలని కోరుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.

ఇక గంగూబాయి మూవీ జులై నెలలో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ముంబైలోని ఫిల్మ్‌సిటీలో అజయ్ దేవ్‌గన్, అలియా భట్‌పై షూట్ జరుగుతుండగా, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై నిరసన తెలిపిన కామతిపుర నివాసితులు సైతం ఈ చిత్రం పట్ల సిగ్గుపడుతున్నామని తెలిపారు. కామతిపుర ముంబైలోని రెడ్ లైట్ ప్రాంతమని ఇక నుంచి దయచేసి చెప్పకండని.. ఎందుకంటే అక్కడి యువత ఇప్పుడు ఆ ప్రాంత ఇమేజ్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు అభ్యర్థిస్తున్నారు.

Next Story

Most Viewed