తూ.గో.లో మరో నిర్భయ ఘటన..

by  |
తూ.గో.లో మరో నిర్భయ ఘటన..
X

దిశ, తూర్పుగోదావరి :
తూర్పుగోదావరి జిల్లాలో మరో నిర్భయ ఘటన చోటుచేసుకుంది. బుధవారం డిగ్రీ చదువుతున్నవిద్యార్థినిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన తూ.గో.జిల్లా మండపేట మండలం ఇప్పనపాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..తన మిత్రుడితో కలిసి బయటకు వెళ్లిన ఓ యువతిని నలుగురు దుండగులు బంధించారు. అతని స్నేహితుడిపై దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితులను అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన్టట్టు పోలీసులు తెలిపారు.

tags ;gangrape, east godavari, like nirbhaya incident, 4 members, degree students

Next Story

Most Viewed