స్నేహం ముసుగులో దారుణం..

29

దిశ, వెబ్‌డెస్క్: హైదారాబాద్‌ మహానగరం కూకట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. స్నేహం ముసుగులో జూబ్లీహిల్స్‌కు చెందిన బాలికపై ముగ్గురు అత్యాచారం చేశారు. బర్త్ డే కేకులో మత్తు మందు కలిపి బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం విషయం బయటకు చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరింపులకు గురిచేశారు. బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.

ఆ తర్వాత కూతురిని పేరెంట్స్ నిలదీయడంలో అసలు విషయం వెల్లడైంది. దీంతో నిందితులు జోసెఫ్, రాము, నవీన్‌లపై కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలపారు.