మందేసి… చిందేసిన పంచాయతీ రాజ్ ఉద్యోగులు

by  |
gajwel panchayati raj employees having alcohol drinking party in mango garden
X

దిశ ప్రతినిధి, మెదక్ : లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అధికారులే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అధికారులే లాక్ డౌన్ సమయంలో మందు.. చిందు వేశారు. ఇది ఎక్కడో కాదు.. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని కొండపాక మండలంలోని మామిడితోటలో అధికారులు మందు పార్టీని నిర్వహించారు. కొండపాక మండల అధికారులు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీకి మహిళా ఉద్యోగులు హాజరు కావడం గమనార్హం.ల్లా ఎంపీఓలకు ఆహ్వానం అందగా.. డీఆర్‌డీఓ, ఇన్‌ఛార్ట్ డీపీవో భోజనం చేసి వెళ్లినట్లు సమాచారం. పార్టీకి కొండపాక మండల పంచాయతీ కార్యదర్శులు చందాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విందులో సిద్దిపేట జిల్లాలోని 22 మండలాలకు చెందిన పంచాయతీ రాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విధులకు ఎగనామం పెట్టి మందేసి చిందేసిన అధికారుల తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు పంచాయతీ రాజ్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed