బోర్డు తిప్పేసిన మరో సంస్థ.. ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూళ్లు

by  |
బోర్డు తిప్పేసిన మరో సంస్థ.. ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ఫన్‌ల్యాబ్ టెక్నాలజీస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. బీటెక్ ప్రెషర్స్‌కు ఉద్యోగాలు కల్పిస్తామని వందలాది విద్యార్థులకు టోకరా పెట్టింది. ఒక్కో విద్యార్థి నుంచి డిపాజిట్ పేరుతో రూ.20 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేసింది. సదరు విద్యార్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చిన నెల రోజుల్లోపే సంస్థ చేతులెత్తేసింది. కంపెనీ యాజమాన్యానికి ఫోన్లు చేయగా వారి స్విచ్ ఆఫ్ వస్తున్నాయని బాధితులు ఆందోళన పడుతున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కంపెనీ యాజమాన్యం కోసం గాలిస్తున్నారు. గతంలోనూ నిందితులపై పలు కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు నేడు లేబర్ కమిషన్‌ను ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.

Next Story

Most Viewed