బ్రేకింగ్ : అన్నదాతల ఆగ్రహం.. హైదరాబాద్-వరంగల్ నేషనల్ హైవే పై భారీ ట్రాఫిక్ జామ్

by  |
బ్రేకింగ్ : అన్నదాతల ఆగ్రహం.. హైదరాబాద్-వరంగల్ నేషనల్ హైవే పై భారీ ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వానా కాలం సీజన్ ముగిసి యాసంగి దగ్గర పడుతున్నా ఇంకా కొనుగోలు ప్రారంభించకపోవడంపై రైతులు కదం తొక్కుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం, ధాన్యం బస్తాలు అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల ఏకంగా వడ్లు కొట్టుకుని పోయాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు అకాల వర్షాల వలన భారీగా నష్టపోయారు. తాము నష్టపోవడానికి ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవడానికి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడం, రైస్ మిల్లుల వద్ద లారీల్లోని ధాన్యం బస్తాలను అన్‌లోడ్ చేయించే విషయంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం ప్రభుత్వం తీరును నిరసిస్తూ హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై గల బీబీ నగర్ కొనుగోలు కేంద్రం వద్ద వడ్లకు నిప్పటించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed