హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. భారీ ట్రాఫిక్ జామ్

by  |
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. భారీ ట్రాఫిక్ జామ్
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీన‌గ‌ర్‌లో భారీ వ‌ర్షం కురిసింది. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఎండ కొట్టగా.. సాయంత్రం ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్ముకోవ‌డంతో పాటు ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. దీంతో ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌షుక్‌న‌గ‌ర్‌, చైతన్యపురి, స‌రూర్‌న‌గ‌ర్‌, మ‌న్సూరాబాద్‌, నాగోల్‌, హ‌య‌త్‌న‌గ‌ర్‌, కొత్త‌పేట్‌, క‌ర్మ‌ాన్‌ఘాట్, హ‌స్తినాపురం, బీఎన్‌ రెడ్డిన‌గ‌ర్‌, వ‌న‌స్థ‌లిపురం త‌దిత‌ర ప్రాంతాలలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.

అంతేకాకుండా నగరంలోని పలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అక‌స్మాత్తుగా భారీ వ‌ర్షం కురవడంతో ప్ర‌జ‌లు, వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. రోడ్ల‌పై వ‌ర‌ద‌నీరు చేర‌డంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. రోడ్ల‌పై నిలిచిన వ‌ర‌ద‌నీటిని తొల‌గించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు డీఆర్ఎఫ్ బృందాల‌ను రంగంలోకి దింపారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.


Next Story