మళ్లీ ఇంటర్నెట్ ఔటేజ్.. స్తంభించిన వెబ్‌సైట్లు

by  |
Outage Websites
X

న్యూఢిల్లీ: ఇంర్నెట్ సేవలు మంగళవారం ఉదయం మరోసారి స్తంభించిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా హై ట్రాఫిక్ ఉండే పలువెబ్‌సైట్ల సేవలు నిలిచిపోయాయి. అమెజాన్ రిటైల్ వెబ్‌సైట్, రెడ్డిట్, ట్విచ్, స్పొటిఫై, పింటరెస్ట్‌ సహా లీడింగ్ న్యూస్ సైట్స్ ఫైనాన్షియల్ టైమ్స్, ది గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్, అల్ జజీరాల సేవలు కొంతకాలం అందుబాటులో లేకుండా పోయాయి. స్టాక్ ఓవర్‌ఫ్ల, గిట్‌హబ్, గవ్.యూకే, హులు, హెచ్‌బీవో మ్యాక్స్, ఖోరా, పేపాల్, షాపిఫై‌లపైనా ఔటేజ్ ప్రభావం పడింది. వీటిని బ్రౌజ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ 503 సర్వీస్ అనవలేబుల్, లేదా కనెక్షన్ ఫెయిల్యూర్ అని పేజీలో కనిపించాయి. కొంత కాలం తర్వాత మళ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

దీనంతటికి ఫాస్ట్‌లీ నడుపుతున్న కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్(సీడీఎన్) ఫెయిల్యూర్ కారణమని గార్డియన్ యూకే కరస్పాండెంట్ పేర్కొన్నారు. సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయని, అంతరాయానికి గల కారణాలను గుర్తించి, పరిష్కరించామని ఫాస్ట్‌లీ తర్వాత వివరించింది. ఫాస్ట్‌లీ ఒక కంప్యూటింగ్ సర్వీసెస్ ప్రొవైడర్. ఇది వెబ్‌సైట్ లోడింగ్ టైమ్‌ను వేగవంతం చేయడం, సర్వీస్ అందుబాటులో వచ్చే అవాంతరాలను నియంత్రించడానికి, హై ట్రాఫిక్‌ డీల్ చేయడానికి ఉపకరిస్తుంది.



Next Story

Most Viewed