షాపింగ్ మాల్స్‌లో బంపర్ ఆఫర్

by  |
షాపింగ్ మాల్స్‌లో బంపర్ ఆఫర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వాణిజ్య సంస్థల్లో పార్కింగ్ రుసుమును వసూలు చేయొద్దని 2018లో జీవో నెంబరు 63ను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఎక్కువ షాపింగ్ మాళ్లు అవేవీ పట్టించుకోకుండా పార్కింగ్ వ్యవధిని బట్టి భారీగా రుసుం వసూలు చేస్తున్నాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా మున్సిపల్ కమిషనర్‌కు భారీగా ఫిర్యాదులు అందడంతో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పార్కింగ్ వసూళ్ల దుర్వినియోగాన్ని నిరోధించడానికి కొన్ని షరతులు విధిస్తూ గురువారం సర్క్యులర్ జారీ చేశారు. అందులో పార్కింగ్ నిర్వహనదారులు తప్పనిసరిగా వెహికల్ ఇన్ఫర్మేషన్, ఎంట్రీ టైమ్‌ను రాసి స్టాంప్ వేసి తగిన రుసుమును మాత్రమే వసూలు చేయాలని ఉంది. ఒకవేళ వాహనదారుడు షాపింగ్ మాల్‌లో కొనుగోళు చేసి ఉంటే వారి నుంచి ఎలాంటి రుసుము తీసుకొవ్వద్దని పేర్కొంది. ఈ నోటీస్ అందింన నాటి నుంచి 15 రోజుల్లోగా ప్రక్రియను పూర్తిచేసి అమలులోకి తీసుకురావాలని ఆదేశించింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం తనిఖీలు చేసి అమలు చేయని వారిపై తెలంగాణ అపార్ట్‌మెంట్స్ యాక్ట్ 1987 లోని సెక్షన్ 24, 28 కింద రూ.50 వేల జరిమానా విధిస్తామని పేర్కొంది.

Next Story

Most Viewed