ఆస్పత్రిలో చేరిన మాజీ క్రికెటర్

by  |
ఆస్పత్రిలో చేరిన మాజీ క్రికెటర్
X

బెంగళూరు: దిగ్గజ లెగ్‌స్పిన్నర్, భారత మాజీ క్రికెటర్ బీఎస్ చంద్ర‌శేఖర్ పాక్షిక పక్షవాతానికి గురికావడంతో సోమవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. మాట తడబడటంతోపాటు తీవ్ర అలసటతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్‌ను సాధారణ వార్డ్‌కు తరలించామని, ఆయనకు ఫిజియోథెరఫి నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. చంద్రశేఖర్ వేగంగా కోలుకుంటున్నారని, బుధవారం లేదా గురువారం ఆయన్ని ఇంటికి వచ్చే అవకాశం ఉన్నదని ఆయన భార్య సంధ్య చంద్రశేఖర్ భగవత్ తెలిపారు.

‘చంద్రశేఖర్ మెదడు రక్తనాళాల్లో చిన్నపాటి బ్లాక్ ఉంది. అతి స్వల్పమైన స్ట్రోక్. మందుల ద్వారా రెండు రోజులు లేదా వారంలో పూర్తిగా కోలుకుంటారు. ఎలాంటి సమస్య లేదు. ఆయన‌కు ప్రాణాలకు హాని కలిగించే స్థాయిలో ఆరోగ్య సమస్య తలెత్తలేదు. చంద్రశేఖర్ ఆరోగ్యం చాలా స్థిరంగా ఉన్నదని అభిమానులకు తెలియజేయండి. ఆయనకు ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ’ అని సంధ్య పేర్కొన్నారు. దిగ్గజ లెగ్ స్పిన్నర్ అయిన చంద్రశేఖర్ తన తొలి మ్యాచ్‌ను 1961లో ఆడారు. 58 టెస్టు మ్యాచ్‌లు ఆడి 242 వికెట్లు తీసుకున్నాడు. 15ఏండ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్ కెరీర్‌లో 16సార్లు ఐదు వికెట్లు తీశాడు. చంద్రశేఖర్ తన చివరి టెస్టు మ్యాచ్ 1979లో ఆడాడు. న్యూజిలాండ్‌పై ఏకైక వన్డే మ్యాచ్ ఆడిన చంద్రశేఖర్ 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.


Next Story

Most Viewed