బ్యాలెట్ పేపర్లు మర్చిపోయాం..

by  |
బ్యాలెట్ పేపర్లు మర్చిపోయాం..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితి నెలకొంది. హాల్ నంబరు 8లో రెండు బ్యాలెట్ పేపర్లు బయటకు వచ్చాయని కొంతమంది అధికారులు చెబుతుండగా, మరో అధికారి బ్యాలెట్ పేపర్.. హాల్‌లో ఎన్నికల సిబ్బంది మర్చిపోయారని, దాన్ని హోంగార్డు తీసుకుని ఎన్నికల అధికారికి అప్పగించారని చెబుతున్నారు. దీనిపై స్పష్టత లేకపోవడంతో మరికొంత గందరగోళం ఏర్పడింది.

ఇదిలావుంటే.. కౌంటింగ్ సమయంలో బ్యాలెట్ పేపర్లు మర్చిపోయామని డీఐజీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. దాన్ని వెంటనే హోంగార్డు.. ఎన్నికల అధికారికి అందిచారని తెలిపారు. గత మూడు రోజులుగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని, అసత్యాలు ప్రచారం చేయోద్దని కోరారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందన్నారు.కౌంటింగ్‌ను వేగవంతం చేసేందుకు టేబుళ్లను 7 నుంచి 14 టేబుళ్లకు పెంచుతున్నామని వివరించారు. రెండు బ్యాలెట్ పేపర్లు బయటకు వచ్చిన విషయం మా దృష్టికి వచ్చిందని, అవి మా కస్టడీలోనే ఉన్నాయని పేర్కొన్నారు.



Next Story

Most Viewed