పెరిగిన వాటి ధరలు.. తగ్గిన ద్రవ్యోల్బణం

by  |
business
X

దిశ, వెబ్‌డెస్క్: ముడి చమురు, తయారీ వస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో భారీగా పెరగడంతో జూన్ నెల భారత టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(డబ్ల్యూపీఐ) రికార్డు స్థాయి నుంచి స్వల్పంగా తగ్గింది. అయితే, వరుసగా మూడో నెలలోనూ టోకు ద్రవ్యోల్బణం 12.07 శాతంతో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జూన్‌లో కొవిడ్ పరిణామాలతో తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా అధికంగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. మేలో జీవిత కాల గరిష్ఠాల స్థాయిలో 12.94 శాతంగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం నమోదైన సంగతి తెలిసిందే. ఇక 2020, జూన్ నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.81 శాతం కుదించుకుపోయినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌తో పాటు ఉక్కు, ఆహార ఉత్పత్తులు, రసాయనాల ధరల పెరుగుదల వల్లే ద్రవ్యోల్బణ అధికంగా పెరిగేందుకు కారణమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ప్రధాన విభాగాలైన ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం మేలో 37.61 శాతం నుంచి 32.83 శాతానికి తగ్గగా, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 8.11 శాతం నుంచి 6.66 శాతానికి దిగొచ్చింది. అయితే, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం మేలో 10.83 శాతం నుంచి 10.88 శాతానికి పెరిగింది. ఇక, ఫుడ్, నాన్-ఫుడ్ విభాగాలను కలిగిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో ఉల్లి ధరలు 64.32 శాతం పెరగ్గా, ముడి పెట్రోలియం ధరలు 62.63 శాతం పెరిగాయి.


Next Story

Most Viewed