ఔత్సాహికులకు ఎఫ్ఎంసీ- ఎఫ్ఎల్ఓ మెంటర్షిప్ సెల్

by  |
ఔత్సాహికులకు ఎఫ్ఎంసీ- ఎఫ్ఎల్ఓ మెంటర్షిప్ సెల్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఔత్సాహికులకు కొత్త వ్యాపారాన్ని స్థాపించడానికి అవసరమైన గైడెన్స్ ఇచ్చేందుకు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎఫ్ఎంసీ- ఎఫ్ఎల్ఓ మెంటర్ షిప్ సెల్‌ను వెబినార్‌లో ఆవిష్కరించింది. ఆన్‌లైన్ సమావేశంలో ఐఐఐటీ హైదరాబాద్ ప్రొ.రమేష్ లోగానాథన్ మాట్లాడుతూ స్టార్టప్ రంగంలో మహిళల ప్రాతినిద్యం పెరగాలని ఆకాంక్షించారు. వ్యాపారాన్ని ఆరంభించేటప్పుడు సమాజం, సమాజ అవసరాన్ని బాగా అర్థం చేసుకుని నిర్ధారించుకోవాలన్నారు. వ్యాపార కాలంలో మార్కెటింగ్ పరిస్థితులు, కార్పొరేట్ వాతావరణం, ప్రస్తుత మహమ్మారి వంటి అంశాలను అధ్యయనం చేయాలన్నారు. కంపెనీ ప్రణాళికలు, వ్యూహాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

ఎఫ్ఎల్వో హైదరాబాద్ చాప్టర్ ఛైర్‌పర్సన్ ఎంఎస్ ఉషారాణి మాట్లాడుతూ నేను 25సంవత్సరాల క్రితం వ్యాపారంలోకి అడుగు పెట్టినప్పుడు ఇలాంటి మెంటర్షిప్ లేదన్నారు. ఆ రోజుల్లో పరిస్థితులే వేరుగా ఉండేవన్నారు. మెంటర్షిప్ అనేది వ్యవస్థాపక సేవ, జీవిత చక్రంలోని ప్రతి దశలోనూ వ్యవస్థాపకులకు అందుబాటులో ఉంటుందన్నారు. సరైన అవగాహన లేని కారణంగా 70శాతంకు పైగా స్టార్టప్‌లు విఫలమవుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. వెబినార్‌లో మార్కెటింగ్, బ్రాండింగ్, సేల్స్, లీగల్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, డిజిటైజేషన్ తదితర అంశాలపై చర్చించారు. ఎఫ్ఎంసీ హైదరాబాద్ చాప్టర్‌లో నందారావు, ఉమా చిగురుపతి, పూజా మిత్ర ఉన్నారు. ప్రతినెల మొదటి బుధవారం ఈ అంశాలపై చర్చలు నిర్వహించనున్నట్లు చెప్పారు.



Next Story

Most Viewed