'ఆ పథకం ద్వారా ఆటో పరిశ్రమకు ప్రయోజనాలు'

by  |
ఆ పథకం ద్వారా ఆటో పరిశ్రమకు ప్రయోజనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (PLI) పథకాన్ని ఆటోమొబైల్ పరిశ్రమకు విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రాబోయే ఐదేళ్లలో పరిశ్రమకు గణనీయమైన ప్రయోజనాలు కలుగుతాయని ఫిచ్ సొల్స్యూషన్స్ అభిప్రాయపడింది. అయితే, దేశీయంగా ఉన్న కొన్ని ఆటంకాలు కొందరు పెట్టుబడిదారులకు సవాళ్లుగా ఉన్నాయని పేర్కొంది.

‘పీఎల్ఐ పథకం ద్వారా 2020-25 మధ్య కాలంలో భారత ఆటో తయారీ పరిశ్రమకు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, అనుబంధ సరఫరా వ్యవస్థలకు గణనీయమైన ప్రయోజనాలు కలుగుతాయని ఫిచ్ సొల్యూషన్స్ కంట్రీ రిస్క్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA)కు దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రోత్సాహక నిధిలో అధిక భాగం ఐదేళ్ల కాలానికి సుమారు రూ. 42.1 లక్షల కోట్ల అందుకోనున్నట్టు నివేదిక తెలిపింది. అయితే, దేశీయంగా నిర్మాణాత్మక సవాళ్లను ఎదుర్కోవడంలో పెట్టుబడిదారులకు ఇబ్బందులు ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది.

Next Story

Most Viewed