కొత్తగా ఆ దేశం నుంచి భారత్ చమురు దిగుమతి..

by  |
కొత్తగా ఆ దేశం నుంచి భారత్ చమురు దిగుమతి..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల ఒపెక్ ప్లస్ దేశాల నుంచి చమురు ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో భారత్‌కు కొత్తగా చమురు దిగుమతి కోసం గయానా దేశం ఆ లోటును తీరుస్తోంది. భారత్ చమురు దిగుమతిలో మూడో అతిపెద్ద దేశంగా ఉంది. ఈ క్రమంలో అరబ్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడంతో దిగుమతులపై ఆధారపడ్డ మన దేశం కొత్త సమస్యను ఎదుర్కొంది. దీన్ని అధిగమించేందుకు దేశీయంగా ఉన్న చమురు శుద్ధి సంస్థలు ప్రత్యామ్నాయం కోసం గయానాను ఎంచుకున్నాయి. దక్షిణ అమెరికాలోని గయానా దేశం 2020లో చమురు ఎగుమతులను మొదలుపెట్టింది.

అమెరికా, పనామా, చైనా, కరేబియన్ దేశాలకు ఎగుమతులను నిర్వహిస్తున్న సమయంలో భారత్ కూడా ఈ జాబితాలో చేరింది. మార్చి తొలి వారంలో గయానా నుంచి బయలుదేరిన చమురు నౌక ఏప్రిల్ 8న భారత్‌కు చేరుకోనుంది. కాగా, భారత్ అత్యధికంగా వెనిజులా నుంచి చమురు దిగుమతులను నిర్వహించగా, ఆ దేశంపై అమెరికా ఆంక్షల కారణంగా గడిచిన మూడు నెలలుగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్ వెనిజులా పక్కనే ఉన్న గయానా నుంచి చమురును తెప్పించుకుంది. ఒపెక్ ప్లస్ నుంచి చమురు దిగుమతులు క్షీణించడంతో రష్యా, అమెరికా, కెనడా, మెక్సికో నుంచి భాత కొనుగోళ్లను పెంచిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed