డిండిలో తొలి కరోనా కేసు, వెంటనే మృతి

by  |
డిండిలో తొలి కరోనా కేసు, వెంటనే మృతి
X

దిశ, దేవరకొండ: డిండి మండలంలో తొలి కరోనా కేసు సోమవారం నమోదు కావడంతో పాటు వ్యక్తి మృతిచెందాడు. మండల వైద్యాధికారి రఘురాం నాయక్ వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కాపులపూర్ గ్రామానికి చెందిన వంకేశ్వరం లక్ష్మయ్య(56) ఈ నెల 20న బైక్ పైనుంచి కింద పడటంతో జ్వరం వచ్చింది. సమీప చారకొండ మండలంలో చికిత్స తీసుకోగా తగ్గింది. ఈ నెల 25న మళ్లీ జ్వరం రావడంతో అదే గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్య దగ్గర చికిత్స తీసుకుని సెట్ అయ్యాడు. కానీ సోమవారం అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు నిరాకరించారు. దీంతో మళ్లీ దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా మధ్యాహ్నం 12:00 ప్రాంతంలో అనుమానం వచ్చిన వైద్యులు కోవిడ్ టెస్టులు చేశారు. అయితే ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన్ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో మరణించాడు. దీంతో మండల వైద్యాధికారి సదరు వ్యక్తి ఇంటికి వెళ్లీ అతని కుటుంబ సభ్యులకు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని చెప్పారు. అంతేగాకుండా కరోనా జాగ్రత్తల గురించి పలు సూచనలు చేసాడు.


Next Story

Most Viewed