ఢిల్లీ జూలో తొలి బర్డ్ ఫ్లూ కేసు

by  |
ఢిల్లీ జూలో తొలి బర్డ్ ఫ్లూ కేసు
X

న్యూఢిల్లీ: ఢిల్లీలోని నేషనల్ జులాజికల్ పార్క్‌లో శనివారం మొదటి బర్డ్ ‌ఫ్లూ కేసు నమోదైంది. సోమవారం జూలో మృతిచెందిన గుడ్లగూబ నమూనాలను పరీక్షల కోసం పంపగా పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు జూలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. ‘పంజరంలోని ఓ గుడ్లగూబ మృత్యువాత పడటం మా దృష్టికి వచ్చింది. పలు నమూనాలను సేకరించి సెరోజికల్ పరీక్షల కోసం ఢిల్లీ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖకు పంపాం.

భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యురిటీ అనిమల్ డిసిజెస్(ఎన్‌ఐహెచ్ఎస్‌ఏడీ)‌లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా హెచ్‌5ఎన్8 అవెన్యూ ఇన్‌ఫ్లూ యెంజా వైరస్ సోకినట్లు తేలింది’ అని జూ డైరెక్టర్ రమేశ్ పాండే తెలిపారు. సోమవారం ఢిల్లీలోని పార్కులు, నీటి కొలనులలోని బాతులు, కాకుల నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపగా బర్డ్ ఫ్లూ రాష్ట్రంలో ప్రబలినట్లు స్పష్టమైంది. దేశంలో ఇప్పటివరకు ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే.


Next Story