ఫుట్ పాత్ పై మూసి ఉన్న దుకాణాలలో అగ్ని ప్రమాదం

by  |
ఫుట్ పాత్ పై మూసి ఉన్న దుకాణాలలో అగ్ని ప్రమాదం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మూసి ఉన్న ఫుట్ పాత్ దుకాణాలు మూడింటిలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రహారిని అనుసరించి ఏర్పాటు చేసిన చిన్న దుకాణాలలో మారుతి అనే వ్యాపారి చెప్పుల దుకాణం, శివ అనే వ్యక్తి చెరుకు బండి వ్యాపారం, రవి పాన్ షాప్ నిర్వహిస్తున్నారు. కాగా కొవిడ్ లాక్ డౌన్ కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారు దుకాణాలను మూసి వేసి వెళ్లిపోయారు.

అయితే రాత్రి సుమారు 7 గంటల సమయంలో మూసి ఉన్న దుకాణాలు రెండింటి నుండి పొగ, మంటలు రావడాన్ని అక్కడున్న వారు గమనించి పోలీసులకు, గౌలిగూడ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని స్వల్ప వ్యవధిలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ 60 వేల విలువ గల చెప్పులు, రూ 40 వేల విలువ గల పాన్ డబ్బా , చెరుకుబండి మొత్తం లక్ష రూపాయల ఆస్థి అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.



Next Story

Most Viewed