కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం..

by  |
కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం..
X

దిశ, రాజేంద్రనగర్ : మూతపడిన పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల్లో అంతా కాలిబూడిదయ్యింది. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. సీఐ నరసింహ కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన సంజయ్ సింగ్ అనే వ్యక్తి రాజేంద్రనగర్ సర్కిల్ కాటేదాన్ పారిశ్రామిక వాడలోని భవనంపై ఒక అంతస్తు కిరాయికి తీసుకుని ప్లాస్టిక్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఫ్యాక్టరీలకు పైభాగంలో ఉపయోగించే ఎగ్జిట్ ఫ్యాన్‌ల ఫ్రెమ్‌లను తయారు చేస్తున్నాడు.

సరైన మార్కెటింగ్ లేని కారణంగా గత మూడు నెలలుగా ఫ్యాక్టరీ మూతపడిందని, శుక్రవారం రోజున ఉదయం పది గంటల సమయంలో షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఫ్యాక్టరీ పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed