బెంగాల్‌లో నేడే తుది విడత పోలింగ్..

by  |
బెంగాల్‌లో నేడే తుది విడత పోలింగ్..
X

కోల్‌కతా : సుమారు మూడు నెలలుగా సాగుతున్న సమరానికి నేడు తెరపడనుంది. పశ్చిమబెంగాల్‌లో నేడు చివరిదైన ఎనిమిదో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికలలో 84 లక్షల మంది ఓటర్లు 283 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ముర్షిదాబాద్, బిర్భుమ్ లలోని అన్ని నియోజకవర్గాలతో పాటు మాల్దా (6 స్థానాలు), కోల్‌కతాలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు గాను 11,860 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ సిద్దం చేసింది. దేశం మొత్తాన్ని ఆకర్షించిన బెంగాల్ ఎన్నికలలో ఇదే ఆఖరు విడత కాగా మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. తుది విడత ఎన్నికలు ముగిశాక గురువారం సాయంత్రం ఆరు తర్వాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి.


Next Story