‘ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలి’

by  |
‘ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలి’
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉండాలని ఎంపీ ధర్మపూరి అర్వింద్ అన్నారు. సోమవారం కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం వర్చువల్ పద్ధతిలో జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. చాలా కొనుగోలు కేంద్రాల్లో నెలరోజులైనా, ధాన్యం ఇంకా తూకం అవ్వట్లేదని, రైస్ మిల్లర్లు తరుగు పేరిట 3 నుండి 4 కిలోలు తగ్గిస్తున్నారని, లారీల సమస్య, హమాలీల సమస్య తీవ్రంగా ఉందని ఆయన ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ లారీల కొరత, హమాలీల కొరతపై సంబంధిత కాంట్రాక్టర్ పై ఒత్తిడి పెంచేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానన్నారు. ః

ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కిసాన్ మోర్చా నాయకులను కోరారు. నియోజకవర్గ నాయకులు కూడా కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల యొక్క సమస్యలు తీర్చేవిధంగా పోరాడాలని, అప్పుడే వారికి భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా మక్కలు కోత దశకు వచ్చినందున మక్క కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతులకు ఇచ్చే జీలుగ విత్తనాల కేవలం 30% వరకే సరఫరా అయ్యాయని,వచ్చే ఖరీఫ్ సీజన్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల విత్తనాలు, ఎరువులను రైతులకు సరఫరా చేసేలా జిల్లా కలెక్టర్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వర్చువల్ సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, భాజపా రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లోక, భూపతిరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోయ సాంబశివరావు, నియోజకవర్గ బాధ్యులు, కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed