ICC చైర్మన్ ఎన్నిక ఆలస్యంపై ఆగ్రహం..

by  |
ICC చైర్మన్ ఎన్నిక ఆలస్యంపై ఆగ్రహం..
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (Icc) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ (Shashank manohar) దిగిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు బోర్డుకు చైర్మన్‌ను ఎన్నుకోలేదు. జులై 1న శశాంక్ పదవీ విరమణ చేసిన తర్వాత ఇమ్రాన్ ఖవాజా (Imron khawaja) తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయి చైర్మన్‌ను ఎన్నుకోకపోవడంపై ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (Fica) డైరెక్టర్ హీత్ మిల్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూజీలాండ్ క్రికెటర్స్ అసోసియేషన్ సీఈవోగా ఉన్న హీత్స్ (Hills) ఐసీసీ చేస్తున్న ఆలస్యంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఇది క్రికెట్‌కు చాలా హాని చేస్తుందని ఆయన మీడియాకు వెల్లడించారు. ‘కరోనా సంక్షోభ సమయంలో క్రికెట్ అత్యున్నత నిర్ణాయక మండలికి బాస్ లేకపోవడం చాలా విచారకరం. ఒక అంతర్జాతీయ క్రీడను నడిపించే నాయకుడిని ఎన్నుకోవడానికి ఎందుకు ఆలస్యం అవుతున్నదో అర్థం కావడం లేదు. ఇప్పటికే గత చైర్మన్ పదవి నుంచి దిగిపోయి రెండు నెలలు గడిచిపోయింది.

అయినా బోర్డు ఇంత నిర్లక్ష్యంగా (Careless) ఎందుకు ఉన్నది’ అని ఆయన ప్రశ్నించారు. కాగా, చైర్మన్ ఎన్నికపై ఇప్పటికే ఐసీసీ మూడు సార్లు సమావేశం అయ్యింది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం కంటే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిదని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గతంలో చైర్మన్ పదవికి ఈసీబీ అధ్యక్షుడు కొలిన్ గ్రీవ్స్ (Collins greevs) ముందంజలో ఉన్నారు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ (Sourav ganguly)పేరు తెరపైకి వచ్చాక ఎన్నిక పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నది. త్వరలో జరగబోయే ఐసీసీ సమావేశంలో ఎన్నికపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నది.



Next Story

Most Viewed