రేపటి నుంచి ఫాస్టాగ్ కంపల్సరీ

by  |
రేపటి నుంచి ఫాస్టాగ్ కంపల్సరీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ‌వ్యాప్తంగా సోమవారం నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి అమ‌ల్లోకి రానుంది. ఆదివారం అర్థరాత్రి నుంచి ఫాస్టాగ్ ఉన్న వాహనాలు మాత్రమే హైవేల‌పైకి ఎక్కాలి. లేదంటే రెట్టింపు టోల్ భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు ఫాస్టాగ్ త‌ప్పనిస‌రిగా వినియోగించాలనే నిర్ణయించకున్నా.. దానిని కేంద్రం వాయిదా వేస్తూ వచ్చింది. ఫాస్టాగ్‌ వినియోగంతో హైవేల‌పై టోల్ ప్లాజాల వద్ద సమయం వృథా అయ్యే అవ‌కాశం ఉండ‌దు. వాహనాలకు ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ఖరీదు వాహనంపై ఆధారపడి ఉంటుంది. ఫాస్టాగ్ కోసం వాహన రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలు అందుబాటులో ఉంచుకోవాలి.

రాష్ట్రంలో 21 టోల్​ఫ్లాజాలు

రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ఉన్న 21 టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్​అమలు కానుంది. ఇప్పటివరకు టోల్​గేట్ల వద్ద ఉన్న క్యాష్​టోల్​రూట్లను ఒక్కదానికే పరిమితం చేయనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు నాలుగేండ్ల కిందటే ఫాస్టాగ్​విధానం అందుబాటులోకి వచ్చినా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ప్రస్తుతం ఫాస్టాగ్​లేని వెహికల్స్ ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మనోహరాబాద్, ఇందల్వాయి, రోల్ మమడ, పిప్పరవాడ, గంజాల్, భిక్‌నూర్, దిలావర్​పూర్, పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, రాయికల్, షకాపూర్, పుల్లూర్, కడ్తాల్, కోనేటిపురం, గూడూర్, ముత్తోజిపేట, కోమల్ల, కోమటిపల్లి, చింతపల్లి, గౌరారం టోల్ ఫ్లాజాలు రాష్ట్రంలో ఉన్నాయి. వాస్తవానికి నేషనల్ హైవేలపై టోల్‌‌‌‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌‌‌‌ ఎక్కువగా ఉన్నప్పుడు క్యాష్​చెల్లించే వెహికల్స్​బారులు తీరాల్సి వస్తోంది. పండుగల టైంలో అయితే టోల్ గేట్ దాటాలంటే సుమారు గంట నుంచి రెండు గంటలు సమయం పడుతోంది. క్యాష్ రూపంలో చెల్లింపు, వెహికల్స్‌లో వెళ్లేవారి దగ్గర తగిన చిల్లర లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని రూట్లలో పండుగలు, శని, ఆదివారాల్లో టోల్ గేట్ల దగ్గర పోలీసులు సెక్యూరిటీగా ఉంచి ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

అందుబాటులోకి మొబైల్ యాప్‌

ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ అధికారులు మై ఫాస్టాగ్‌‌‌‌, ఫాస్టాగ్‌‌‌‌ పార్టనర్‌‌‌‌ మొబైల్‌‌‌‌‌యాప్‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చారు. వెహికల్​ఓనర్లు, డ్రైవర్లు తమ బ్యాంకు ఖాతాతో ఈ యాప్‌‌‌‌ను లింక్​చేసుకుని, కొంత సొమ్మును ఎంపిక చేసిన బ్యాంకులు, టోల్‌‌‌‌ ప్లాజాల్లో చెల్లిస్తే బార్​కోడ్‌తో కూడిన ‘ఫాస్టాగ్‌‌‌‌’ స్టిక్కర్‌‌‌‌ ఇస్తారు. దానిని వెహికల్ ముందు భాగంలో అద్దంపై అతికించాలి. వెహికల్​టోల్ ప్లాజాలోకి ఎంటర్​ అయినప్పుడు ‘ఫాస్టాగ్‌‌‌‌ బార్‌‌‌‌ కోడ్‌‌‌‌’ను ఎలక్ట్రానిక్‌‌‌‌ టోల్‌‌‌‌ కలెక్షన్‌‌‌‌ (ఈటీసీ) కెమెరాలు స్కాన్‌‌‌‌ చేస్తాయి. గేటు ఆటోమేటిగ్గా తెరుచుకుంటుంది. ఫాస్టాగ్​నుంచి ఫీజు కట్​అవుతుంది. దీని వల్ల టైం ఆదా అవడంతో పాటు చిల్లర సమస్య ఉండదని టోల్‌‌‌‌ప్లాజాల స్టాఫ్​చెప్తున్నారు.

త్వరలో క్యాష్​చెల్లిపులు ఎత్తివేత

ప్రస్తుతం ఫాస్టాగ్​తప్పనిసరి చేయడంతో పాటు ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్​రెండింతలు వసూలు చేయనున్నారు. ఈ క్యాష్ వసూలు కౌంటర్లను సైతం త్వరలోనే ఎత్తేస్తారు. ఇక నుంచి కచ్చితంగా ఫాస్టాగ్​ ఉంటేనే వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ముందుకు కదులుతాయి.



Next Story

Most Viewed