హర్యానాలో పెళ్లి పత్రికలపై రైతు నినాదాలు

by  |
హర్యానాలో పెళ్లి పత్రికలపై రైతు నినాదాలు
X

ఛండీగడ్: రైతుల ఉద్యమాన్ని హర్యానా ప్రజలు తమ జీవితాల్లో భాగం చేసుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలకు తోచిన మార్గాల్లో సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. పెళ్లి పత్రికలపైనా రైతులకు మద్దతుగా నినాదాలు, రైతు నేత సర్ ఛోటు రామ్, భగత్ సింగ్‌ల చిత్రాలను ప్రింట్ చేసుకోవడం ఈ ఏడాది పెళ్లిల్ల సీజన్‌లో ట్రెండ్‌గా మారుస్తున్నారు. ‘అన్నదాత లేకుంటే ఆహారం లేదు’ వంటి చిన్న చిన్న నినాదాలను వివాహ ఆహ్వానపత్రికలపై ప్రింట్ చేయడానికి ఎంచుకుంటున్నారు.

ఈ నెల 20న తన కుమారుడికి పెళ్లి చేస్తున్న దుంద్రేహి గ్రామస్తుడు ప్రేమ్ సింగ్ గోయత్ మాట్లాడుతూ.. వేలాది మంది రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని, వారికి సంఘీభావంగా ఏదైనా చేయాలన్న తపనలోనుంచే ఈ ఆలోచన తనకు వచ్చిందని వివరించారు. అందుకే తన కుమారుడి పెళ్లి పత్రికలో రైతులకు మద్దతుగా నినాదాలను, భగత్ సింగ్ చిత్రపటాన్ని ముద్రిస్తున్నట్టు తెలిపారు.

Next Story

Most Viewed