పురుగులమందు డబ్బాలతో ఎమ్మార్వో ఆఫీసుకొచ్చిన రైతులు (వీడియో)

by  |
Farmers protest
X

దిశ, బోథ్: రైతులు పురుగుల మందు డబ్బాలతో తహసీల్దార్ కార్యాలయానికి రావడం మండలంలో కలకలం రేపింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కౌఠ(బి) గ్రామానికి చెందిన చాట్ల నర్సింగ్, నారాయణ, గంగూబాయి అనే రైతులకు గ్రామంలో 15 ఎకరాల పట్టా భూమి ఉంది. అయితే, వారి భూమిని అధికారులు మరొకరి పేరు మీద పట్టా చేసి ఇచ్చారు. ఈ విషయం తెలిసిన రైతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనిపై అధికారులకు విన్నవించగా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాపోయారు.

డబ్బులకు కక్కుర్తి పడే తమ భూమిని మరొకరి పేరుమీద చేశారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మా భూమిని మళ్లీ మా పేరుమీదకు చేయాలని మంగళవారం పురుగుల మందు డబ్బాలతో ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చి ఆందోళన చేశారు. న్యాయం చేయకపోతే చావడానికి వెనకాడబోమని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బోథ్ ఎస్ఐ రాజు అక్కడికి చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని సముదాయించారు. అనంతరం ఆందోళన విరమించిన రైతులు మాకు న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed