అప్పుల ఊబిలో అన్నదాతలు.. మెుదటి రెండు స్థానాల్లో ఏపీ, తెలంగాణ

by  |
అప్పుల ఊబిలో అన్నదాతలు.. మెుదటి రెండు స్థానాల్లో ఏపీ, తెలంగాణ
X

దిశ, ఏపీ బ్యూరో: దేశానికి పట్టెడన్నం పెడుతున్న అన్నదాత రోజు రోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు అప్పులు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతన్న కొత్త అప్పుల చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మన దేశంలో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జాబితాలో తొలి రెండు స్థానాల్లో తెలుగు రాష్ట్రాలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అన్నదాతల జాబితాను రాజ్యసభలో కేంద్రం ప్రకటించింది.

అయితే ఏపీలో 93.2శాతం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు ఆ జాబితాలో స్పష్టం చేసింది. ఇక రెండవ స్థానంలో తెలంగాణలో 91.7 శాతం రైతులు రుణభారంలో ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ (69.9 శాతం), కర్ణాటక (67.7 శాతం), తమిళనాడు (65.1 శాతం), ఒడిశా (61.2 శాతం), మహారాష్ట్ర (54 శాతం)లు ఉన్నాయి. ఏపీలో రైతు భరోసా పథకం, తెలంగాణలో రైతుబంధు పథకాలు అమలవుతున్నా రైతులు అప్పులపాలు అవుతుండటం గమనార్హం.



Next Story

Most Viewed