‘‘గ్యాప్ తీసుకోండి.. కానీ, వదిలేయొద్దు’’

by  |
‘‘గ్యాప్ తీసుకోండి.. కానీ, వదిలేయొద్దు’’
X

ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో కోట్ల మంది ఫాలోవర్లను కలిగివున్న ప్రధాని నరేంద్ర మోడీ, తాను ఈ ఖాతాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని నిన్న చేసిన ట్వీట్ వైరల్ అయింది. ప్రధాని చేసిన ట్వీట్ గంట వ్యవధిలోనే 26వేలసార్లకు పైగా అంటే క్షణానికో కామెంట్ వచ్చి రీ ట్వీట్ అయింది. మోడీ నుంచి నిరంతర అప్‌డేట్స్ కొనసాగాలని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అత్యధికులు ప్రధానిని కోరుతున్నారు. నో సార్ అని కొన్ని వేల కామెంట్లు వచ్చాయి. ‘‘కావాలంటే చిన్న బ్రేక్ తీసుకోండిగానీ, పూర్తిగా వదిలేయవద్దు’’ అని కూడా కామెంట్లు వచ్చాయి. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి, మోదీ వదిలేస్తే తామూ సోషల్ మీడియాను వదిలేస్తామని స్పష్టం చేశారు. ఇక నో సార్ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది.
కాగా, సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ చాలా చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో 5.33కోట్లమంది, ఫేస్‌‌బుక్‌‌లో 4.4కోట్ల మంది, ఇన్‌ స్ట్రాగామ్‌లో 3.52ట్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లను కలిగివున్న టాప్-3 నేత, ఫేస్‌బుక్‌లో టాప్-2 నేత మోడీయే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సైతం ఇటీవల ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Tags: Fans, responding, Modi’s tweet, facebook, instagram,twitter



Next Story

Most Viewed