Drunk & Drive.. రూ. 227 కోట్ల జరిమానా 

by  |
Drunk & Drive.. రూ. 227 కోట్ల జరిమానా 
X

దిశ, ఫీచర్స్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరి హత్యకు కారణమైన వ్యక్తికి టెక్సాస్ కోర్టు రికార్డు బ్రేకింగ్ నష్టపరిహారాన్ని ఇవ్వాలని సూచించింది. యూఎస్ చరిత్రలోనే లార్జెస్ట్ పర్సనల్ కంపెన్సేషన్‌గా చెప్పబడుతుండగా.. టెక్సాస్‌లో 2017లో జరిగిన కారు ప్రమాదంలో 16ఏళ్ల అమ్మాయితో పాటు గ్రాండ్ మదర్‌ చనిపోయింది. దీంతో బాధిత ఫ్యామిలీకి $301 బిలియన్(రూ.227 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

2017 నవంబర్ 12న ఆఫీస్ నుంచి వస్తూ తన మనవరాలు ఔజుని తమయ్ ఆండర్సన్‌ను పిక్ చేసుకుంది తామ్రా కే కిండ్రెడ్. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లే మార్గంలో కార్పస్ క్రిస్టిలోని కూడలి గుండా వెళ్తుండగా.. రెడ్‌ లైట్ ఉండగానే తన మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన వ్యక్తి వీరి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నానమ్మ, మనవరాలితో పాటు సదరు వ్యక్తి కూడా చనిపోయాడు. అయితే 2018లో కిండ్రెడ్ అండ్ ఆండర్సో ఫ్యామిలీ తమకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా.. తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed