రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

by  |
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. సంగారెడ్డి జిల్లా కోహీర్​లో ఉష్ణోగ్రతలు 3.4 డిగ్రీలకు పడిపోయాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాను చలిపులి వణికిస్తోంది. రోజు రోజు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​లో 3.6, కొమురంభీం జిల్లా గిన్నెధరిలో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో కేవలం 6 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కామారెడ్డి జిల్లా దొంగిల్​లో 4.7, ఆదిలాబాద్​ జిల్లా బేలలో 5.0, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ సత్వర్​లో 5.1 డిగ్రీలు నమోదైంది. మరోవైపు హైదరాబాద్​లో కూడా చలి పెరుగుతోంది. రాజేంద్రనగర్​ పరిధిలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. బీహెచ్​ఈఎల్​ ప్రాంతంలో 7.8గా ఉంది.


Next Story