పాపం వలస కూలీ.. రైల్వే పట్టాలపై మృత్యువును తప్పించుకున్నా.. అక్కడ తప్పలే..!

by  |
hyd
X

దిశ, చార్మినార్ : మతిస్థిమితం సరిగా లేని ఓ లేబర్​ ఫలక్​నుమా రైల్వే బ్రిడ్జి పై నుంచి కిందికి దూకిన ఘటన గురువారం మధ్యాహ్నం పాతబస్తీలో తీవ్ర కలకలం రేపింది. అంత ఎత్తులో నుంచి కిందికి దూకిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఛత్రినాక పోలీసులు ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మొఘల్​పురాలో మరోసారి ఆటో దూకాడు. తీవ్రంగా గాయపడిన షేక్​ సలీం భాషా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలలోకి వెళితే … కర్నూల్​కు చెందిన షేక్​ సలీం భాషా (36) పాతబస్తీకి గత కొన్నేళ్ల క్రితం వలస వచ్చాడు. అక్కడక్కడ లేబర్​ పనులు చేసేవాడు. మతిస్థిమితం సరిగ్గాలేని షేక్​ సలీం భాషా గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలక్​నుమా రైల్వే బ్రిడ్జి పైన ఉన్న ప్రహరీపైకి ఎక్కి హల్​చల్​ చేశాడు.

వాహనాదారులు ఎంత నచ్చజెప్పినా పంచ్​ కేబుల్​ను పట్టుకుని వేలాడుతూ ఫలక్​నుమా బ్రిడ్జి ప్రహరీ నుంచి కిందికి దూకాడు. పట్టాల పై పడ్డ సలీం భాషా సరిగ్గా అదే సమయంలో రైలు వస్తుండడంతో లేవడానికి ప్రయత్నించినా కాకపోవడంతో పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు పట్టాలపై నుంచి లాగారు. దీంతో సెకనులో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన సలీం భాషా ను చికిత్స నిమిత్తం ఆటోలో ఉస్మానియాకు తరలిస్తుండగా మార్గ మధ్యలో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని.. మీతో రానని మరోసారి ఆటో దూకేశాడు. తీవ్రంగా గాయపడిన సలీం భాషాను ఛత్రినాక పోలీసులు నచ్చజెప్పి చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సలీం భాషా అక్కడిక్కడే మృతి చెందాడు.



Next Story

Most Viewed