Fake Money Apps : ఆ లింకుతో సర్వం స్వాహా..

by  |
Fake Money Apps : ఆ లింకుతో సర్వం స్వాహా..
X

దిశ, కూకట్‌పల్లి : బాలానగర్​ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఎస్.లక్ష్మి అనే ఓ మహిళ తనకు తెలిసిన వారు “లైటినింగ్ పవర్​ బ్యాంక్​” యాప్​ను డౌన్‌లోడ్​ చేసుకుని అందులో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందని చెప్పారు. దీంతో సదరు మహిళ www.lightningbp.com/hs/pages/register/register? లింక్​నుంచి లైటినింగ్​పవర్​ బ్యాంక్​యాప్ ను డౌన్‌లోడ్ చేసి, అందులో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. కొద్దిసేపటి తరువాత ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్​చేసి మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులకు తక్కువ సమయంలో అధిక రాబడి వచ్చిందని నమ్మించాడు.

కొద్దిసేపటి తరువాత తను పెట్టిన డబ్బులకు లాభం వచ్చినట్టు ఎస్ఎంఎస్​వచ్చింది. దీంతో ఆశ ఎక్కువై సదరు మహిళ తనతో పాటు, తన కుటుంబ సభ్యులు, బంధువులు అందరి వద్ద నుంచి వసూలు చేసిన 12,91,025 రూపాయలను యాప్​ ద్వారా పెట్టుబడి పెట్టింది. ఎంతసేపటికి ఎటువంటి ఫోన్​ కాల్​ కాని, లాభం కాని రాకపోవడంతో తను మోసపోయానని భావించిన సదరు మహిళ బుధవారం బాలానగర్​ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వహీదుద్దిన్​ తెలిపారు.

Next Story