ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్

by Disha Web Desk 19 |
ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేసే తేదీ ఫిక్స్ అయ్యింది. వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 13వ తేదీన మోడీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి ప్రధాని నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. మోడీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఉత్తరప్రదేశ్ బీజేపీ యూనిట్ అప్రమత్తమైంది. నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసే ర్యాలీ, సభకు భారీ జనసమీకరణ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం వారణాసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోడీ మరోసారి అక్కడి నుండి బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. ఇక, వారణాసిలో ప్రధాని మోడీపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ రాయ్ పోటీకి దిగుతున్నారు. వారణాసిలో పోలింగ్ జూన్ 1వ తేదీన చివరి దశలో జరగనుంది.

Next Story